Thursday, January 16, 2025

లారీ కింద పడి యువతి మృతి

- Advertisement -
- Advertisement -

పాల్వంచ టౌన్ : లారీ కింద పడి ఓ యువతి మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం మణుగూరుకు చెందిన షేక్ సీమ (23) షేక్ మహమ్మద్ పాషాలు కలిసి కొత్తగూడెంకు వారి బంధువుల ఇంటికి బైక్‌పై వెళుతున్నారు.

మార్గమధ్యలో ఉన్న పాల్వంచ కెటిపిఎస్ నుంచి యాష్ టాంకర్ కొత్తగూడెం వైపునకు వెళుతున్నది. ఈ క్రమంలో ముందు వెళుతున్న బైక్‌ను టాంకర్ అతి వేగంగా వెళ్ళి ఢీకొట్టింది. దీనితో షేక్ సీమ అక్కడికక్కడే మృతి చెందినది. సీమ బంధువుల ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్‌ఐ కే. నరేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News