Thursday, January 23, 2025

లారీ కింద పడి మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: రోడ్డు దాటే క్రమంలో ప్రమాదవశాత్తు లారీ కింద పడి ఒక మహిళ మృతి చెందిన సంఘటన సోమవారం నార్కెట్‌పల్లి అద్దంకి జాతీయ రహదారిపై జరిగింది. ఈ సంఘటనకు సంబందించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం మద్యాహ్నం నల్లగొండ నుంచి వస్తున్న లారీ నార్కెట్‌పల్లి మండలం ఎల్లారెడ్డి గూడెం దాటిన తరువాత అద్దంకి నార్కెట్‌పల్లి రహదారి గురుకుల పాఠశాల సమీపంలోకి రాగానే అదే సమయంలో రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

మహిళతో పాటు ఉన్న ఒక సంవత్సరం వయసుగల పసిపాప గాయాలతో బయటపడగా నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా మృతురాలు సుమారు (30), చేతిపై అమ్మ అనే పచ్చ బొట్టు ఉన్నది. మృతురాలి వివరాలు తెలిసినవారు నార్కెట్‌పల్లి ఎస్‌ఐ సెల్ నెం బ ర్ 8712670186,సిఐ నెంబర్ 8712 670 148 నెంబర్లను సంప్రదించాల్సిందిగా నార్కెట్‌పల్లి పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News