Wednesday, January 22, 2025

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

దుగ్గొండి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందిన సంఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గిర్నిబావి నుంచి వరంగల్ వైపు వెళ్తున్న బైక్, ఆల్టో కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఏ పూరి రజిత అక్కడికక్కడే మృతిచెందగా భర్త శ్రీధర్‌రెడ్డి, పిల్లలకు తీవ్రగాయాలు కాగా వెంటనే ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. కాగా మృతురాలి బంధువైన ఏపూరి యాదవరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పంచనామా నిర్వహించడం జరిగిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News