Monday, December 23, 2024

ప్లాట్ ఫాం, ట్రైన్‌కి మధ్యలో ఇరుక్కున్న మహిళ

- Advertisement -
- Advertisement -

మధిర : మధిరకు చెందిన ఓ మహిళ ట్రైన్ ఎక్కుతుండగా ప్లాట్ ఫాం, ట్రైన్‌కి మధ్యలో ఇరుక్కొని గాయపడిన ఘటన ఖమ్మం రైల్వే స్టేషన్‌లో ప్రమాదం గురువారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం… మధిరకు చెందిన రైల్వే ఉద్యోగి నాగేశ్వరరావు అతని భార్య కళ్యాణి ఖమ్మంలోని ఓ ఆసుపత్రికి చెకప్ కోసం వచ్చారు. ఆసుపత్రిలో చెకప్ అనంతరం మధిర వెళ్ళడానికి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు.

ట్రైన్ ఎక్కుతుండగా ఒక్కసారిగా ట్రైన్ కడలడంతో ట్రైన్ నుంచి జారి ట్రైన్‌కు, ప్లాట్ ఫాంకు మధ్యలో నాగేశ్వరరావు భార్య ఇరుక్కు పోవడంతో ఎడమ కాలు పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది. అతి కష్టం మీద బయటకు తీసిన సిబ్బంది వెంటనే క్షతగాత్రురాలిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News