Tuesday, November 5, 2024

మహిళా బిల్లు తేవాల్సిందే

- Advertisement -
- Advertisement -

పార్లమెంట్ పార్టీల ఫ్లోర్ లీడర్ల భేటీలో కెకె, నామా

మద్దతు పలికిన పలు పార్టీల నేతలు
ఎన్‌డిఎ కూటమిలోని కొన్ని పార్టీలు ఒకే

నేటి నుంచి ఐదురోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు

మన తెలంగాణ/న్యూఢిల్లీ/ఖమ్మం బ్యూరో :  ఓబీసీలు, మహిళలకు చట్ట సభల్లో 33శాతం రి జర్వేషన్లు కల్పించే బిల్లులను ఆమోదించేందుకు కేంద్రంపై పార్లమెంట్ సమావేశంలో ఒత్తిడి తీ సుకొస్తామని బిఆర్‌ఎస్ పార్టీ పార్లమెంటరీ నేత కె. కేశవరావు , లోక్ సభా పక్ష నేత నామ నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం నుంచి జరగబోయే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో ఆదివారం న్యూఢిల్లీలో కేంద్రం అఖిల పక్ష సమావేశం నిర్వహించింది. సమావేశాలు సజావుగా జరిపేందుకు, అన్ని పార్టీల వారి సంపూర్ణ సహకారం కోరుతూ కేంద్ర ప్రభుత్వం ఈ సమావేశం నిర్వహించింది. బిఆర్‌ఎస్ తరఫున పార్టీ పార్లమెంటరీ నేత కె. కేశవరావు, లోక్సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా నామ నాగేశ్వరరావులు మాట్లాడుతూ సిఎం కెసిఆర్ ఆదేశాల మే రకు పార్లమెంట్ ఉభయ సభల్లో బిఆర్‌ఎస్ ఎం పిలు గళం ఎత్తుతారని అన్నారు. బిసిలు, మహి ళా హక్కుల సాధనకు, వారికి సమున్నత స్థానం కల్పించేందుకు బిఆర్‌ఎస్ తరపున పార్లమెంట్ లో పెద్ద ఎత్తున గళం వినిపిస్తామని స్పష్టం చేశా రు. బిసి, మహిళా రెండు బిల్లులు ఈ ప్రత్యేక స మావేశాల్లోనే ప్రవేశపెట్టి, ఆమోదించేలా పోరాడతామని చెప్పారు. మిగతా అన్ని సమస్యలపై నా కేంద్రాన్ని నిలదీస్తామని వారు అన్నారు. మ హిళలకు చట్ట సభల్లో 33శాతం రిజర్వేషన్లు బిల్లుపై తెలంగాణ మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఏకగ్రీవ తీర్మానం చేసి, కేంద్రానికి పంపినా ఇంతవరకు పట్టించుకోలేదన్నారు. రాజకీయాల్లో మహిళా భాగస్వామ్యాన్ని పెంచేందుకు, వారి హక్కులు కాపాడేందుకు బిఆర్‌ఎస్ కట్టుబడి ఉందని వారు చెప్పారు. ఓబీసీలు, మ హిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లు ల అమోదం కోసం సిఎం కెసిఆర్ ఇప్పటికే ప్ర ధాని నరేంద్ర మోడీకి లేఖ కూడా రాయడం జరిగిందన్నారు.మహిళా బిల్లు చిరకాలంగా పెండింగ్‌లో ఉందని బిజెడి సహా వివిధ పార్టీలు ఈ సందర్భంగా గుర్తు చేశాయి. ఇకనైనా బిల్లును సభలో ప్రవేశపెట్టాల్సి ఉంది. దీనిని ఏకాభిప్రాయ సాధనతో ఆమోదింపచేసుకోవల్సి ఉందని పార్టీలు తెలిపాయి.

లోక్‌సభ రాష్ట్రాల చట్టసభలైన అసెంబ్లీల్లో మహిళకు 1/3 కోటాను కల్పించాలనేది మహిళా బిల్లులోని ప్రధానాంశం. చట్టసభలలో ఇంతకాలం మహిళకు తగు ప్రాతినిధ్యం లేకుండా పోతోందని, ప్రభుత్వం వజ్రోత్సవాల నేపథ్యంలో ఈ సభను ఏర్పాటు చేస్తున్నందున కీలకమైన ఈ బిల్లు వచ్చేలా నెగ్గేలా చూడాల్సి ఉందని పార్టీలు తెలిపాయి. ఈ సెషన్‌లోనే మహిళా బిల్లు ఆమోదం పొందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్ని ప్రతిపక్ష పార్టీలు స్పష్టం చేశాయని ఆ తరువాత లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌధురి తెలిపారు. బిజెపి మిత్రపక్ష ఎన్‌సిపి నేత ప్రఫుల్ పటేల్ మాట్లాడుతూ ఈ సెషన్‌లో బిల్లు ఆమోదానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరినట్లు వివరించారు. పార్లమెంట్‌లో దీనిని ప్రవేశపెడితే ఏకాభిప్రాయంతో ఇది నెగ్గితీరుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇది రెగ్యులర్ సెషన్ అని, ప్రత్యేకం ఏమీ కాదని ప్రభుత్వం తెలిపిందని , కాగా కొత్త పార్లమెంట్ భవనంలోకి ప్రవేశం గణేష్ చతుర్థి దశలో మంగళవారం జరుగుతుందని తెలిసిందని చెప్పారు. అయితే ఇప్పటికీ తమకు ప్రభుత్వం ఉద్ధేశం గురించి పూర్తి స్థాయిలో తెలిసిరాలేదని , సరికొత్త అజెండాతో అందరిని ఆశ్చర్యచకితులు చేసినా చేయవచ్చునని తెలిపారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, సరిహద్దులలో చైనాతో వివాదాలు వంటి కీలక విషయాలు కూడా అఖిలపక్ష సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి. అఖిల పక్ష సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రి పియూష్ గోయల్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీలు ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించారు. మాజీ ప్రధాని, జెడిఎస్ జాతీయ స్థాయి నాయకులు హెచ్‌డి దేవెగౌడ, బిఆర్‌ఎస్ నుంచి కె కేశవరావు, డిఎంకె నుంచి కనిమొళి, టిడిపికి చెందిన రామ మోహన్ రెడ్డి, టిఎంసి తరఫున డెరెక్ ఓ బ్రెయిన్, ఆప్ నేత సంజయ్‌సింగ్, బిజెడి నుంచి సస్మిత్ పాత్ర, ఆర్జేడీ నుంచి మనోజ్ ఝా, జెడయు నుంచి అనిల్ హెగ్డే, ఎస్‌పి ఎంపి రామ్ గోపాల్ యాదవ్ ఇతరులు అఖిలపక్షభేటీకి హాజరయ్యారు.
మెరుపులుంటాయా?
పార్లమెంట్ ప్రత్యేక సమావేశం సోమవారం ( 18వ తేదీ) నుంచి ఆరంభమవుతుంది. ఐదురోజుల పాటు జరుగుతుంది. స్వాతంత్య్ర వజ్రోత్సవాలు, పార్లమెంట్ ఘన చరిత్ర విశ్లేషణకు, కొన్ని బిల్లుల ఆమోదానికి ఈ సెషన్ ఉంటుందని, ఇది సాధారణ సెషన్ అని, ప్రత్యేకం ఏదీ లేదని ప్రభుత్వం అజెండా వెలువరించింది. అయితే ఐదు రోజుల సిట్టింగ్ దశలో విస్మయకర అంశాలను ప్రభుత్వం ప్రకటిస్తుందని భావిస్తున్నారు. ప్రభుత్వం తన సొంత అజెండాతోనే ఈ సెషన్‌కు రంగం సిద్ధం చేసుకుందని విపక్షాలు ఆరోపించాయి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్ల నియామక ప్రక్రియలో పలు కీలక మార్పులతో ఇటీవలి వర్షాకాల పార్లమెంట్ సెషన్‌లో రాజ్యసభలో బిల్లు తీసుకువచ్చారు. సిఇసి, ఇసిల నియామకాలను ప్రభుత్వం తన గుప్పిట్లోకి తీసుకునేందుకు ఈ బిల్లును ఉద్ధేశించారని విమర్శలు తలెత్తాయి. ఇప్పటి సెషన్‌లో ప్రభుత్వం తనకున్న బలంతో ఈ బిల్లును ఆమోదింపచేసుకుంటుందని వెల్లడైంది. ఇంతవరకూ సిఇసి, ఇసిల సేవల విధానాలు , అధికారిక హోదాలు సుప్రీంకోర్టు జడ్జి సర్వీస్ కండిషన్‌తో సమానంగా ఉంటూ వచ్చాయి. అయితే ఇప్పుడు దీనిని ప్రభుత్వం ఈ బిల్లు ద్వారా కేబినెట్ సెక్రెటరీ స్థాయి సేవల పద్థతికి తీసుకురానుంది. తొలిరోజు పాత భవనంలో సమావేశాలు ఆరంభమవుతాయని, మరుసటి రోజు కొత్త భవనంలోకి పార్లమెంట్ వేదిక మారుతుందని వార్తలు వెలువడుతున్నాయి. ముందు స్పెషల్ సెషన్ అని, అజెండా లేదని తెలిపిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి జోషీ ఆ తరువాత ఇఇ రెగ్యులర్ సెషన్ అని, అజెండా ఖరారు చేశారు.
జాతీయ సమైక్యత వేడుకల్లో బిఆర్ ఎస్ నేతలు
జాతీయ సమైక్యతా దినోత్సవంతో పాటు ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా న్యూఢిల్లీలోని నూతన పార్లమెంట్ భవన్ వద్ద ఆదివారం జాతీయ పతాక ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, నామ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోక్ సభ స్పీకర్ ఓమ్ బిర్లా, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్‌లు స్వయంగా ఎంపి నామను ఆహ్వానించి, కరచాలనం చేసి కొద్ది సేపు మాట్లాడారు. ఈ సందర్బంగా ఎంపి నామ తెలంగాణా ప్రజలకు జాతీయ సమైక్యత దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. 75 ఏళ్ల క్రితం ఇదే రోజున మన తెలంగాణ భారత దేశంలో అంతర్భాగమైందని గుర్తు చేశారు. రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య దశలోకి మారిందన్నారు. ప్రజలందరి గుండెల్లో దేశభక్తి భావన పెల్లుబికేలా జాతీయ సమైక్యత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామని చెప్పారు. అమరవీరుల త్యాగాలను మననం చేసుకొని తలచుకోవడం మనందరి కనీస బాధ్యత అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News