Thursday, January 23, 2025

అద్భుత దృశ్యం కళ్ల ముందు సాక్షాత్కారం

- Advertisement -
- Advertisement -

ఎనిమిది కాళ్ల సాలీడు గూడు కట్టే విధానాన్ని కెమెరాలో బంధించిన ఎంపి సంతోష్

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రకృతి రమణీయతను ఆస్వాదించడం, ప్రకృతి అందాలకు ఆలవాలమైన వివిధ ఆకర్షణీయమైన దృశ్యాలను వీకెం డ్‌లో తన కెమెరాలో నిక్షిప్తం చేస్తుంటారు రాజ్యసభ సభ్యులు ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్. ప్రకృతి ఆరాధన, పర్యావరణ పరిరక్షణే ధ్యేయం గా ఎంపి సంతోష్ నిరంతరం తపిస్తూ ఉంటారు.

ప్రకృతితో ముడిపిడిన అనేకానేక అందాలను పక్షుల విన్యాసాలు తదితరాలను ఆయన తన కెమె రాలో బంధిస్తుంటారు. వికారాబాద్ అడవుల్లో తొమ్మిది కాళ్ల సాలీడు తన గూడు కట్టుకునే తీరు తెన్నులను తన ఫోటోగ్రఫీలో అత్యంత ఆకర్షణీ యంగా బంధించారు ఎంపి సంతోష్. ఆ అద్భుత రమణీయ దృశ్య చిత్రాలను తన ట్విట్టర్‌లో ఆయన ఆదివారం పోస్ట్  చేశారు. ఈ దృశ్యాన్ని వీక్షిం చిన పలువురు నెటిజన్లు ఎంపి సంతోష్ ప్రకృతి రమణీయతకు అబ్బురపడుతున్నారు. చాలా మంది ఎంపి సంతోష్‌కు ధన్యవాదాలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News