Thursday, January 9, 2025

హోలీ వేడుకల్లో అసభ్య ప్రవర్తన… భారత్ విడిచి వెళ్లిన జపాన్ యువతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఇటీవల జరిగిన హోలీ వేడుకల్లో జపాన్‌కు చెందిన యువతితో కొందరు యువకులు అసభ్యంగా ప్రవర్తించిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఢిల్లీలో జరిగిన ఈ ఘటనలో కొందరు వ్యక్తులు ఆమెకు బలవంతంగా రంగులు పూయడం కనిపిస్తోంది. దీనికి సంబంధించి పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. అలాగే ఆ టూరిస్టు భారత్ వీడి బంగ్లాదేశ్ వెళ్లిపోయారు. భారత్ పర్యటనకు వచ్చిన జపాన్ యువతి ఢిల్లీ లోని పహార్ గంజ్ ప్రాంతంలో ఉంది. దేశమంతా హోలీ ఉత్సవాలు చేసుకుంటున్న తరుణంలో కొందరు యువకులు ఈ జపాన్ టూరిస్టును గట్టిగా పట్టుకొని, ఆమెను చుట్టుముట్టి రంగులు పూశారు. తలపై కోడిగుడ్లు కొట్టారు.

వారిని విడిపించుకొని దూరంగా వెళ్తున్న ఆమెను మరో యువకుడు పట్టుకోగా, అతడి చెంప పగుల గొట్టింది. వారు ఆమెతో ప్రవర్తించిన దృశ్యాలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఆ ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. అయితే వారిపై సదరు యువతి ఎలాంటి కేసూ నమోదు చేయలేదు. దీని తర్వాత బంగ్లాదేశ్ వెళ్లిపోయిన ఆమె ట్విటర్ వేదికగా స్పందించింది. నేను క్షేమంగా ఉన్నాను, ఈ విషయం ఇంత సీరియస్ అవుతుందని అనుకోలేదు అని ఆ యువతి ట్వీట్ చేసింది. అయితే ఈ వీడియోలపై ఢిల్లీ మహిళా కమిషనర్ స్వాతీమాలీవాల్ స్పందించారు. ఈ ఘటన వీడియోలు పరిశీలించి, దానికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని పోలీసులను కోరారు. ఆ వ్యక్తుల ప్రవర్తన సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News