కరీంనగర్: తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నిలిపిన యువనేత మంత్రి కేటీఆర్ అని కరీంనగర్ జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు అన్నారు. సోమవారం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని హుజురాబాద్‌లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్‌లతో కలిసి మొక్కలు నాటి వివిధ కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధికి మంత్రి కేటీఆర్ బాటలు వేశారన్నారు.
భారతదేశంలో ఏ మంత్రి చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో చేసి చూపించారన్నారు. ఐటీ రంగంలో హైదరాబాద్‌ను బెంగుళూర్ లాంటి పట్టణాలకు ధీటుగా అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. హైదరాబాద్‌కు గూగుల్, ఆమెజాన్, మైక్రోస్టాప్ లాంటి ఎన్నో కంపెనీలను తెచ్చి ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను అందించారని అన్నారు. ప్రతి జిల్లాలో ఐటీ టవర్‌ను నెలకొల్పిన ఘనత మంత్రి కేటీఆర్‌కే దక్కిందన్నారు.
మున్సిపల్ శాఖలో సైతం పలుమార్పులు తీసుకుని వచ్చి ప్రజలకు సులభతరమైన సేవలను అందించిన ఘనత కేటీఆర్‌దేనని అన్నారు. రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందేలా భగవంతుడు మంత్రి కేటీఆర్‌ను ఆశీర్వాందించాలని కోరారు. కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని, గ్రిఫ్టే స్మైల్‌లో భాగంగా పలు కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాల్లో బీఆర్‌ఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం జరిగిందన్నారు.