Sunday, April 6, 2025

ఫ్యాన్‌కు ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

కడ్తాల్ : ఫ్యాన్‌కు ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కడ్తాల మండలం మైసిగండి గ్రామంలో చోటుచేసుకుంది. కడ్తాల ఏఏసై విష్ణువర్థన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని మైసిగండి గ్రామానికి చెందిన కేతావత్ నరేష్ (18) మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. గమనించిన కుటుంబసభ్యులు అపస్మారక స్థితిలో ఉన్న నరేష్‌ను కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే నరేష్ మృతి చెందినట్లు ఏఏసై తెలిపారు. మృతుడి తల్లి శారద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడు నరేష్ కందుకూరు విద్యామయి కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News