Saturday, January 11, 2025

సెల్ఫీ తీసుకొని యువకుడి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

కోనరావుపేట: తల్లిదండ్రులు మందలించారని ఓ యువకుడు చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మెడలో ఉరితాడు బిగించుకొని సెల్ఫీ తీసి మరీ బలవన్మరణం చెందాడు. ఈ విషాదకర సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని కమ్మరిపేట తండాలో శుక్రవారం చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తండాకు చెందిన భూక్య రాజు, జ్యోతి దంపతులకు ఒక కుమారుడు దీనేష్ (17), కూతురు దీపిక ఉన్నారు. దంపతులిద్దరు కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. దీనేష్ కొంతకాలంగా స్కూల్‌కు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటున్నాడు. గురువారం దీనేష్ ఒక దుకాణంలో సిగరెట్ డబ్బాను దొంగతనం చేశాడని ఆ షాపు యజమాని ఇంటి వద్దకు వచ్చి గొడవకు దిగాడు.దీంతో తల్లిదండ్రులు దీనేష్‌ను మందలించడంతో మనస్తాపం చెందిన దీనేష్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు.

అయితే గురువారం రాత్రి దీనేష్ ఇంటికి రాకపోవటంతో కుటుంబ సభ్యులు వెతకగా శుక్రవారం తెల్లవారుజామున వట్టిమల్ల గ్రామ శివారులోని దుర్గమ్మ ఒర్రె దగ్గర చెట్టుకు ఉరివేసుకొని కనిపించాడు. ఇదిలా ఉండగా దీనేష్ ఉరివేసుకునే సమయంలో సెల్ఫీ వీడియో తీసి తన స్నేహితులకు పంపాడు. ఇదికాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీసులు దీనేష్ కుటుంబ సభ్యులను వివరాలు తెలుసుకొని షాపు యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ రమాకాంత్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News