Friday, December 27, 2024

కారు ఢీకొని యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

కూకట్‌పల్లి : కారు ఢీకొట్టిన ఘటనలో యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చేటుచేసుకుంది. ఎస్‌ఐ ఆర్.ప్రేమ్ సాగర్ తెలిపిన వివరాల ప్రకారం… ఉదయం 5 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని తునికి చెందిన బత్తుల కృష్ణసాయి వివేక్ (23) కొల్లాపూరి శివలు తమ హోండా బైక్‌పై ఖైతలాపూర్ నుంచి కూకట్‌పల్లికు వస్తున్న సమయంలో ఐ 20 కారు ఢీకొట్టడంతో బైక్‌పై వస్తున్న ఇద్దరు కిందపడిపోయారు. గాయాలపాలైన ఇద్దరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా కృష్ణసాయి వివేక్ మృతి చెందాడు. గాయాలపాలైన శివకు చికిత్సలు చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News