Friday, December 20, 2024

టిప్పర్ ఢీకొని యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

శంకర్‌పల్లి: టిప్పర్ ఢీకొని ఓ యువ కుడు మృతి చెందిన సం ఘటన శంకర్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. స్థానిక ఎస్‌ఐ సంతోష్‌రెడ్డి తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శంకర్‌పల్లి పట్టణా నికి చెందిన జొన్నాడ అనిల్ గౌడ్ (30) రోజు మాదిరిగా వ్యాపార పని నిమిత్తం మున్సిపల్ పరిధిలోని రామ ంతపురంకు వెళ్లారు. కాగా తిరుగు ప్రయాణంలో వెనక నుంచి టిప్పర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనిల్‌గౌడ్ కుటుంబసభ్యులు ఇచ్చిన మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సంతోష్‌రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News