Monday, January 20, 2025

వాహనం ఢీ కొని యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ రూరల్ : గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో యువకుడు మృతి చెందిన సంఘటన నాగర్‌కర్నూల్ మండలం చందుబట్ల గేటు సమీపంలో జరిగింది. ఎస్సై విజయికుమార్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… తెలకపల్లి మండలం పెద్దపల్లి గ్రామానికి చెందిన మారేడు మల్లేష్(23) జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో విధులు నిర్వహించుకుని తన ద్విచక్ర వాహనంపై సొంత గ్రామానికి బయల్దేరుతున్న క్రమంలో మార్గమధ్యలో చందుబట్ల గేట్ సమీపంలో ఓ గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News