Friday, February 21, 2025

సంపు గుంతలోపడి యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

కల్వకుర్తి టౌన్ : ప్రమాదవశాత్తు సంపు గుంతలో పడి యువకుడు దుర్మరణం పాలైన ఘటన బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం కల్వకుర్తి పట్టణంలోని హనుమాన్ నగర్ కాలనీకి చెందిన మహమ్మద్ అంజద్ ఖాన్(30) అదే కాలనీకి చెందిన ఖలీల్ ఇంటిలో ఉన్న నీటి సంపు గుంతలో పడి మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గమనించి తమకు సమాచారం ఇచ్చినట్లు ఎస్సై తెలిపారు.

అంజద్ ఖాన్ మృతి పట్ల పలు అనుమానాలున్నాయని మృతుని కుటుంబ సభ్యులు తెలపడంతో అతని సోదురుడి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై రమేష్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News