Friday, December 27, 2024

బావిలో పడి యువకుడు మృతి

- Advertisement -
- Advertisement -

మరిపెడ: ప్రమాదవశాత్తు బావిలో పడి యువకుడు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లచ్చాతండా గ్రామ పంచాయితీ పరిధిలోని అమిరియాతండాలో బుధవారం చోటు చేసుకుంది. స్ధానికుల వివరాల ప్రకారం మండలంలోని లచ్చాతండా గ్రామ పంచాయితీ పరిధిలోని అమిరియాతండాకు చెందిన గుగులోతు వీరన్న, నాగమణి దంపతుల కుమారుడు గుగులోతు శేఖర్ (20) ఉదయం పశువులను మేత కోసం తీసుకుని వెళ్లాడు.

సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో అనుమానం కలిగిన కుటుంబ సభ్యులు గాలించడం ప్రారంభించారు. ఈ క్రమంలో పక్క గ్రామమైన తండ ధర్మారం శివారులోని వ్యవసాయ బావిలో విగత జీవిగా పడి ఉన్నట్లు గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News