Monday, January 20, 2025

విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి

- Advertisement -
- Advertisement -

బెల్లంపల్లి : బెల్లంపల్లి పట్టణంలోని బుడిదగడ్డ బస్తీకి చెందిన పెండ్యాల శరత్ (23) అనే యువకుడు సోమవారం విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బస్తీలో ఇంటి ముందు ఉన్న ఆటోలో శరత్ పిల్లలు ఆటోలో కూర్చున్నారు.

పక్క నుంచి ఇసుక ట్రాక్టర్ లోడ్‌తో విద్యుత్ స్థంభాలాను ఢీకొనడంతో నిలిపి ఉన్న ఆటోపై ఒక్కసారిగా పడ్డాయి. గమనించిన శరత్ కర్ర సహాయంతో ఆటోలో ఉన్న ముగ్గురు పిల్లలను కాపాడాడు. అనుకోకుండా ఆటోకు తగలడంతో కింద పడిపోయాడు. వెంటనే అతన్ని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు తెలిపారు.

దీంతో బస్తీలో విషాదచాయలు అలుముకున్నాయి. శరత్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సంఘటన స్థలానికి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, గ్రంథాలయ చైర్మన్ ప్రవీణ్‌లు శరత్ కుటుంబాన్ని కలిసి పరామర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News