Wednesday, January 22, 2025

రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి

- Advertisement -
- Advertisement -
  • మరోక యువకుని తీవ్ర గాయాలు

సూర్యాపేట: తన స్నేహితుడి వివాహనికి హజరయి తన సొంత గ్రామానికి తిరిగి వస్తుండగా డిసిఎ ఢీకొని ఒక వ్యక్తి మృతి, మరోకరికి తీవ్రగాయాలు అయిన సంఘటన జాజిరెడ్డిగూడెం మండలంలో చోటు చేసుకుంది.

అర్వపల్లి ఎస్.ఐ. బి. అంజిరెడ్డి , కుటుంబీకులు , స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అర్వపల్లి గ్రామానికి చెందిన ఈద అన్వేష్ , సాయిని లక్ష్మణ్ , కాసర్లపహడ్ గ్రామానికి చెందిన శ్రావణ్ ముగ్గురు కలిసి తన స్నేహితుడి వివాహనికి రామన్నగూడెం వి.కె గార్డెన్ ఫంక్షణ్ హాల్‌కి హజరయి తిరిగి సొంత గ్రామానికి యుటర్న్ తీస్తుండగా డిసిఎం సూర్యాపేట నుండి అతివేగంతో ద్విచ క్రవాహనాన్ని ఫంక్షణ్ హల్ దగ్గర వెనుక నుండి డీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఈద అన్వేష్ ( 21 ) అక్కడికక్కడే మృతి చెందాడు.

మరోకరికి తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమత్తిం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరో వ్యక్తి శ్రావన్‌కు స్వల్పగాయాలు అయ్యాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వెంటనే మృత దేహన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ఇట్టి విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అంజిరెడ్డి తెలిపారు. అన్వేష్ తండ్రి గతంలో చనిపోగా మృతుడికి తల్లి, ఒక సోదరుడు ఉన్నారు. ఎదిగిన కొడుకు చని పోవడంతో ఆకుటుంబంలో , అర్వపల్లి గ్రామంలో విషాద చాయలునెలకొన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News