Friday, February 21, 2025

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

టేకులపల్లి : మండల కేంద్రానికి వచ్చి తిరుగు ప్రయాణంలో పెట్రోల్‌బంక్ సమీపంలో ద్విచక్రవాహన ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి… కోయగూడెం గ్రామానికి చెందిన అబ్బనబోయిన నరేందర్ (25) పనిమీద మండల కేంద్రం టేకులపల్లికి ద్విచక్రవాహనంపై వచ్చి పని ముగించుకుని తిరుగు ప్రయాణంలో పెట్రోల్‌బంక్ సమీపంలో రోడ్డుమీదకు వచ్చిన ఎద్దును తప్పించపోయి అదుపుతప్పి రోడ్డుమీద పడిపోయాడు.

దీంతో అతని తలకు బలమైన గాయాలయ్యాయి దీంతో అంబులెన్స్‌లో కొత్తగూడెం తరలించగా పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మంకు తరలిస్తుండగా మార్గమద్యలో మృతి చెందాడు. మృతునికి తల్లిదండ్రి, అక్క ఉన్నారు. చేతికి అందివచ్చిన కొడుకు మృతి చెందడంలో కుటుంబంలో విషాదంనెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News