Thursday, January 23, 2025

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

కడ్తాల్ : కడ్తాల మండల కేంద్రంలో టిప్పర్‌ను వెనుక నుంచి మోటార్‌సైకిల్‌తో ఢీకొనడంతో యువకుడు మృతిచెందిన సంఘటన కడ్తాల శివారులోని శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపై బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానిక ఏఏసై విష్ణువర్థన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామానికి చెందిన చిట్టిగౌరి వెంకటేష్ (25) మోటార్ సైకిల్‌పై హైదరాబాద్ నుంచి సొంత ఊరికి వెళ్తుండగా మంగళవారం రాత్రి కడ్తాల శివారులోని హనుమాన్ పాల బూత్ వద్ద ముందుగా వెళ్తున్న టిప్పర్ ఎలాంటి ఇండికేటర్ వేయకుండా అతివేగంగా నడుపుతూ సడన్‌గా బ్రేక్ వేయడంతో వెనుక నుంచి మోటార్ సైకిల్‌పై వస్తున్న చిట్టిగౌరి వెంకటేష్ టిప్పర్‌ను వేగంగా ఢీకొట్టడంతో ముఖానికి తీవ్ర గాయాలైనట్లు తెలిపారు. గాయపడిన బాధితుడిని హుటాహుటిన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఏఏసై విష్ణువర్థన్ రెడ్డి తెలిపారు. మృతుడి తండ్రి బాలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News