Sunday, December 22, 2024

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: లారీ బైక్ ఢీకొని యువకుడి మృతి చెందగా మరో వ్యక్తికి గాయాలైన సంఘటన గరిడేపల్లి మండల పరిధిలోని రాయినీగూడెం శివారులో ఆదివారం చోటు చేసుకుంది. స్ధానికులు,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గరిడేపల్లి మండలం రాయినీగూడెం ఊరు శివారులో అతివేగంతో ఉన్న లారీ బైక్ అదుపుతప్పి ఎదురెదురుగా ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న కాల్వపల్లి గ్రామానికి చెందిన పొలగాని సాయి అక్కడికక్కడే మృతి చెందాడు.

బైక్ వెనుక కూర్చున మరో వ్యక్తి గా యాలైనాయి. సాయి మృతదేహాన్ని,గాయపడిన వ్యక్తిని హుజూర్‌నగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News