కంటోన్మెంట్ : మనస్థాపం చెందిన ఓయువకుడు ఆత్మహత్యకు పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బోయిన్‌పల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…..ఓల్డ్‌బోయిన్‌పల్లి అర్‌అర్‌నగర్‌కు చెందిన జె.గోపాల్ నాగజ్యోతి దంపతులు వీరికి ఇద్దరు సంతానం పెద్ద కుమారుడు రాహులు,చిన్న కుమారుడు రోహిత్ (23) బీపార్మసీ పూర్తిచేసిఉద్యోగ ప్రయత్నాలు చేస్తు ఇంట్లోనే ఉంటున్నాడు.బీపార్మసీ చేస్తున్న సమయంలో రోహిత్ పుస్తకాలను ఎక్కువగా చదవే ఆలవాటు ఉండేది.దీంతో ఎప్పుడు చూసిన పుస్తకాలను చదివేవాడు. క్రమంలో గత కొద్దిరోజులుగా డిప్రేష్షన్‌లో ఉంటున్నాడు.
ఈనెల 11న గోవింద్ పనిమీద బయటకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చి తన చిన్నకుమారుడు రోహిత్ ఎక్కడ అని ఆడగగా తల్లి భవనం టెర్రస్‌పై చదువుతున్నాడని సమాధానం చెప్పింది.దీంతో వెంటనే రోహిత్ క్రిందకు తీసుకురావాలని చెప్పటంతో తల్లి భవనంపైకి ఎక్కి చూస్తుండగా రొహిత్ భవనంపై నుంచి క్రిందకు దూకాడు.ఈక్రమంలో రోహిత్ విద్యుత్తు తీగలు తగలటంతో కాలిన గాయాలు అయ్యాయి.హుటాహుటిన ఓప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యుల సూచన మేరకు గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. శుక్రవారం చికిత్స పొందుతూ మృతి చెందటంతో ఆసుపత్రి వర్గాలు కుటుంబసభ్యులకు సమచారం అందించారు.కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.