Tuesday, December 24, 2024

డ్రగ్స్ విక్రయిస్తున్న యువతి అరెస్టు

- Advertisement -
- Advertisement -

కొనుగోలు చేసిన ముగ్గురు విద్యార్థులు
8 గ్రాముల ఎండిఎంఏ, ఆరు మొబైల్ ఫోన్లు స్వాధీనం

మనతెలంగాణ, సిటిబ్యూరోః కొత్త సంవత్సర వేడుకల్లో యువకులకు డ్రగ్స్ విక్రయించిన యువతి, కొనుగోలు చేసిన యువకులను సౌత్‌ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్, చాదర్‌ఘాట్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఐదుగురు నిందితుల వద్ద నుంచి 8 గ్రాముల ఎండిఎంఏ, ఆరు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…సంతోష్‌నగర్‌కు చెందిన ఆయేషా(21) ముంబాయి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి తీసుకుని వచ్చి నగరంలో యువకులను విక్రయిస్తోంది.

యువతి వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసిన యువకులు నగరంలో అవసరం ఉన్న వారికి విక్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే విద్యార్థులు ఇజారుద్దిన్ అనాస్, ఎండి అఫాన్, ఆయాజ్ ఖాన్, షాబాజ్ షరీఫ్ యువతి వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసి అవసరం ఉన్న వారికి విక్రయిస్తున్నారు. విద్యార్థులకు నల్గొండ ఎక్స్ రోడ్డు వద్ద యువతి డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో వెంటనే వెళ్లిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్‌స్పెక్టర్ ప్రకాష్ రెడ్డి, సంజీవ్, సైదాబాబు తదితరులు అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News