Wednesday, January 22, 2025

విమానం టాయిలెట్‌లో స్మోకింగ్ చేసిన యువతి అరెస్టు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: విమానం టాయిలెట్‌లో సిగరెట్ తాగిన ఒక 24 ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని సాల్డా జిల్లాకు చెందిన ప్రియాంక చక్రవర్తిగా ఆమెను పోలీసులు గుర్తించారు. ఆదివారం రాత్రి 9.50 గంటలకు కోల్‌కతా నుంచి బెంగళూరు బయల్దేరిన ఇండిగో విమానం(నంబర్ 716) మూడు గంటల తర్వాత బెంగళూరు చేరుకుంది. విమానంలోని టాయిలెట్‌లో ఎవరో సిగరెట్ తాగుతున్నట్లు అనుమానించిన సిబ్బంది తలుపులు కొట్టి తెరవమనగా లోపల ఉన్న ప్రియాంక సిగరెట్ తాగినట్లు పసిగట్టారు.

డస్ట్‌బిన్‌లో సిగరెట్ పీక కూడా లభించింది. డస్ట్‌బిన్‌లో నీళ్లు పోసిన సిబ్బంది ఈ విషయాన్ని పైలట్‌కు తెలియచేశారు. విమానం బెంగళూరులో ల్యాండ్ కావడానికి అరగంట ముందు ఈ సంఘటన జరిగింది. విమానం ల్యాండ్ అయిన వెంటనే విమాన సిబ్బంది ఆమెను ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బందికి అప్పగించారు. తోటి ప్రయాణికుల ప్రాణాలను ముప్పులోకి నెట్టినందుకు ప్రియాంకపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎయిర్‌పోర్టు భద్రతా విభాగం సహాయ మేనేజర్ కె శంకర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News