Monday, December 23, 2024

మూన్‌లైట్ పబ్బులో యువకుల వీరంగం

- Advertisement -
- Advertisement -

యువతితో డ్యాన్స్ చేసేందుకు యత్నం
అడ్డుకున్న ముగ్గురిపై దాడి

హైదరాబాద్: ఎన్ని చర్యలు తీసుకున్నా పబ్బుల్లో గొడవలు ఆగడంలేదు. గతంలో పబ్బుల్లో ఫుల్‌గా తాగి రోడ్డు మీదికి వచ్చి తన్నుకున్న సంఘటనలు చోటుచేసుకోగా, తాజాగా ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగిన యువకులు వీరంగం సృష్టించారు. పోలీసుల కథనం ప్రకారం…రాకేష్, సంతోష్ అనే యువకులు మూన్‌లైట్ పబ్బులో ఫుల్‌గా మందుతాగారు. అదే పబ్బుకు వచ్చిన యువతితో కలిసి డ్యాన్స్ చేస్తున్న యువకుడిని అడ్డుకుని తాము డ్యాన్స్ చేసేందుకు యత్నించారు.

దీంతో యువతితో డ్యాన్స్ చేస్తున్న యువకుడితో రాకేష్, సంతోష్ గొడవపడ్డారు. దీంతో పబ్బులో ఇరువర్గాలు గొడవపడ్డారు. తర్వాత ఒకరిపై ఒకరు బీరు సీసాలతో దాడి చేసుకున్నారు. బయటికి వచ్చిన తర్వాత యువతికి సంబంధించిన వారు వెళ్తుండగా బయటికి వచ్చిన నిందితులు వారితో మళ్లీ గొడవపడి, దాడి చేయడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. వెంటనే బాధితులు ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్‌స్పెక్టర్ శ్రీనివాసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News