Thursday, January 23, 2025

ఆర్కిటిక్ మంచుగడ్డల్లో పొంచి ఉన్న జోంబీ వైరస్

- Advertisement -
- Advertisement -

ఆర్కిటిక్ రీజియన్ లోని మంచుగుట్టల అడుగున నిక్షిప్తమై ఉన్న వైరస్‌ల నుంచి ప్రమాదం పొంచి ఉందని నాసా వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భూతాపం కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల ఆర్కిటిక్ రీజియన్ పెర్మాఫ్రాస్ట్ కరుగుతుందని పేర్కొన్నారు. పెర్మాఫ్రాస్ట్ అంటే ఆర్కిటిక్ ఉపరితలం అడుగున గడ్డకట్టిన నేల పొర. ఉత్తరార్ధ గోళం అయిదోవంతు పెర్మాఫ్రాస్ట్‌తో కప్పబడి ఉంటుంది. ఇది కరగడం తీవ్రమైతే అడుగున దాదాపు 48,500 సంవత్సరాలుగా నిద్రాణ స్థితిలో గడ్డకట్టి ఉన్న జోంబీ వైరస్‌లు అనే కొన్ని ప్రాణాంతక వైరస్‌లు తిరిగి విజృంభించే ప్రమాదం వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. జర్నల్ వైరసెస్ లో ప్రచురితమై అధ్యయనంలో శాస్త్రవేత్తలు ఈమేరకు హెచ్చరికలు జారీ చేశారు. అయితే పెర్మాఫ్రాస్ట్ నుంచి వెలువడే ఈ ప్రాచీన వైరస్‌లు మందులకు లొంగని మొండి బ్యాక్టీరియా అయినప్పటికీ, వీటి వల్ల వ్యాపించే వ్యాధులను ఆధునిక యాంటీబయోటిక్స్ నియంత్రించ గలవని ఆశిస్తున్నట్టు చెప్పారు. పెర్మాఫ్రాస్ట్ ఆక్సిజన్‌ను అందిస్తున్నప్పటికీ, వాతావరణంతో ఇది సంబంధం లేకుండా వెలుగును ఏమాత్రం లోపలికి చొరనీయదు. ఇది వైరస్‌లకు టైమ్ కాప్సూల్ వంటిదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

చాలాకాలం నాటి జంతువుల అవశేషాలను మమ్మీలుగా చేస్తుంది. పెర్మాఫ్రాస్ట్ నుంచి అనేక ప్రాచీన వైరస్‌లను దిగ్గజ వైరస్ జాతి (పితోవైరస్) తోసహా ఉన్నివెంట్రుకల ఏనుగు జాతి మూలాలు కలిగిన నమూనా నుంచి ఒంటరిగా వేరు చేసి పునరుద్ధరించామని ఫ్రెంచి పరిశోధకులు జీన్ మైకేల్ క్లెవరీ , అతని సహచర బృందం వెల్లడించారు. భారీ డిఎన్‌ఎ వైరస్‌ల సామర్ధంతో 48500 ఏళ్ల తరువాత ఎకాంధమీబా ఇన్‌ఫెక్షన్‌కు గురై ఇన్‌ఫెక్షన్ వ్యాపించేదిగా అంటే వ్యాధులను సంక్రమింప చేసేదిగా మిగిలిపోతుందని తమ అధ్యయనం నిర్ధారిస్తుందని పరిశోధకులు తేల్చారు. ఏకకణ జీవి అమీబా పైనే ప్రభావం చూపించే ప్రాచీన వైరస్‌లపై పరిశోధకులు దృష్టి కేంద్రీకరిస్తున్నట్టు అధ్యయనం వెల్లడించింది.

అలాంటి రిస్కున్న ప్రాజెక్టును చేపట్టకుండానే ఎకాంధమీబాకు సోకిన వైరస్‌లు ఇతర అనేక డిఎన్‌ఎ వైరస్‌లపై కూడా సంక్రమిస్తాయని, తద్వారా మనుషులకు, లేదా జంతువులకు వ్యాపిస్తాయని అంచనా వేసినట్టు పరిశోధకులు వివరించారు. పరిశోధకులు తదుపరి మరింత హెచ్చరికలు చేశారు. పెర్మాఫ్రాస్ట్ కరిగిపోతుండటంతో ఇంతవరకు తెలియని కొన్ని ప్రమాదకర బ్యాక్టీరియా వెలువడి వ్యాపించవచ్చని హెచ్చరించారు. అతినీల లోహిత కిరణాలు (అల్ట్రా వయెలెట్ కిరణాలు,), ఆక్సిజన్, వేడి ఉన్న బాహ్యవాతావరణం లోకి ఒకసారి ఈ బ్యాక్టీరియా వ్యాపించినట్టయితే ఎంతకాలం ఇవి ఉంటాయో, ఎంతవరకు తమకు తగిన అతిథికి సోకుతాయో చెప్పలేమని పరిశోధకులు పేర్కొన్నారు. కానీ భూతాపం పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రిస్కు ఎక్కువగా ఉండవచ్చని పరిశోధకులు హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News