Monday, December 23, 2024

కుటుంబ ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు

- Advertisement -
- Advertisement -

Aadavallu Meeku Joharlu Movie Success Meet

శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటించిన సినిమా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఆదరణ పొందుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటైన మీడియా సమావేశంలో శర్వానంద్ మాట్లాడుతూ “నా కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు కూడా ఈ సినిమా చూసి బాగుందన్నారు. మన ఇంట్లో జరిగే కథలా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుకున్నారు”అని అన్నారు. రష్మిక మందన్న మాట్లాడుతూ “మా అమ్మ నాన్న థియేటర్లో ఈ సినిమా చూశారు. ఇలాంటి మంచి సినిమా చూసి చాలా కాలమైందని వారు అన్నారు. అందరూ కుటుంబంతో వచ్చి ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు”అని తెలిపారు. దర్శకుడు కిషోర్ తిరుమల మాట్లాడుతూ “ఈ సినిమాకు అద్భుతమైన స్పందన వస్తున్నందుకు ఆనందంగా ఉంది. ‘నేను శైలజ’తో కాకుండా ఈ సినిమా నాకు మంచి గుర్తింపు తెచ్చిందని అందరూ చెప్పడం సంతోషంగా ఉంది”అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సుధాకర్ చెరుకూరి, రుచిత, దీప్తి, శ్రీకాంత్, సుజిత్ పాల్గొన్నారు.

Aadavallu Meeku Joharlu Movie Success Meet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News