Monday, December 23, 2024

‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ టైటిల్ సాంగ్‌ రిలీజ్..

- Advertisement -
- Advertisement -

Aadavallu Meeku Joharlu Title Song released
యంగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఆడవాళ్లు మీకు జోహార్లు.. అంటూ సాగే టైటిల్ సాంగ్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. తన జీవితం అలా కావడానికి కారణమైన ఆడవాళ్ల అందరి మీదున్న ఫ్రస్ట్రేషన్‌ను హీరో ఈ పాటలో చూపించారు. తన పెళ్లి కాకపోవడానికి కూడా వారే కారణమంటూ నిందిస్తున్నట్టు కనిపిస్తోంది. శ్రీమణి రాసిన సాహిత్యం, దేవీ శ్రీ ప్రసాద్ గానం చక్కగా కుదిరింది. ఈ చిత్రం ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Aadavallu Meeku Joharlu Title Song released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News