Wednesday, December 25, 2024

బోగస్ ల ఏరివేతకు ఎల్ పిజి కస్టమర్ల ఆధార్ ఈకెవైసి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఎల్ పిజి కస్టమర్లలో బోగస్ వినియోగదారుల ఏరివేతకు ఆధార్ ఆధారిత ఈకెవైసి నిర్వహిస్తున్నామని ఆయిల్ మినిష్టర్ హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. చాలా మంది బోగస్ వినియోగదారులు తమ పేరిట వంట గ్యాస్ ను బుక్ చేసుకున్నా అది కమర్షియల్  దుకాణాలకు మళ్లించడం జరుగుతోందని వివరించారు. ఇంటికి వాడే ఎల్ పిజి 14.2 కిలోల సిలిండర్ ధర రూ. 803(కేజికి రూ. 56.5 చొప్పున) కాగా, హోటళ్లు, రెస్టారెంట్ లు వాడే 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1646(కిలోకి రూ. 86.3 చొప్పున) గా ఉంది.

ఇప్పుడు బోగస్ వినియోగదారులకు ఆధార్ అనుసంధానిత ఈకెవైసి తప్పనిసరి అని మంత్రి హర్దీప్ సింగ్ పూరి ‘ఎక్స్’ పోస్ట్ లో పెట్టారు. ఇక ఎనిమిది నెలలో ఈ ప్రక్రియ జరిగిపోతుంది.

చమురు మంత్రిత్వ శాఖ పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ విభాగం ప్రకారం ఇండియాలో 32.64 కోట్ల ఎల్ పిజి వినియోగదారులు క్రియాశీలంగా ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News