Monday, January 20, 2025

ఢిల్లీలో ఆదార్ కార్డుల ప్రత్యేక క్యాంపులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవలి కనివిని ఎరుగని వరదలతో వేలాది మంది ఆధార్ కార్డులు, పలు రకాల డాక్యుమెంట్లు నీట కొట్టుకువెళ్లాయి. ఇటువంటి వారందరికి తిరిగి కార్డులు జారీ చేసేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపడుతారు. త్వరలోనే స్పెషల్ క్యాంప్‌లు ఏర్పాటు అవుతాయని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ప్రకటించారు. నార్త్ ఢిల్లీలోని మోరీ గేట్ ప్రాంతంలో ఆయన ఓ సహాయ శిబిరాన్ని సందర్శించారు. వరదలతో తలెత్తిన పలు సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని, కీలక పత్రాలు పోయిన వారిని గుర్తించి వారికి తగు విధంగా వీటిని జారీ చేసే ప్రక్రియను చేపడుతారని వివరించారు. స్కూల్ డ్రస్సులు, పుస్తకాలను తిరిగి అందిస్తామన్నారు. పలు ప్రాంతాల్లో నిలిచిపోయిన నీటిని పంపుల ద్వారా ఎత్తివేయిస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News