Monday, April 7, 2025

ఆధార్‌కార్డు నవీకరణ తప్పనిసరి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఖమ్మం రూరల్‌: ఆధార్‌కార్డు నవీకరణ తప్పనిసరిగా చేసుకోవాలని ఆధార్ శాశ్వత కేంద్రం అధికారి, మీ సే నిర్వహణ అధికారి కందుల మంగయ్య తెలిపారు. మండలంలోని ఎం. వెంకటాయపాలెం గ్రామపంచాయితీ కాంప్లెక్స్ యందు శాశ్వత కేంద్రంలో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం రెన్యువల్ చేయబడుతుందని పేర్కొన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, పౌర సేవలను పొందాలనుకునే వారు ఆధార్ నవీకరణ ప్రక్రియను పూర్తి చేసుకోవాలన్నారు. 2016 కంటే ముందు ఆధార్ కార్డు గుర్తింపు పొందిన వారంతా యుఐడిఏ ఈ ఆదేశాల ప్రకారం సంబంధించిన పత్రాలతో ఆధార్ నమోదు కేంద్రాలను సంప్రదించాలని, పరిసర ప్రాంతాల గ్రామాలకు చెందిన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News