Monday, December 23, 2024

ఇకపై బర్త్ సర్టిఫికెట్‌తోపాటు ఆధార్ కార్డు !

- Advertisement -
- Advertisement -

Aadhaar card with birth certificate!

న్యూఢిల్లీ : ఆధార్ విషయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రాష్ట్రాల్లోనూ అప్పుడే పుట్టిన పిల్లలకు బర్త్ సర్టిఫికెట్‌తోపాటు ఆధార్ ఇవ్వాలని నిర్ణయించింది. 16 రాష్ట్రాల్లో ప్రస్తుతం ఈ విధానం అమలు చేస్తుండగా త్వరలోనే అన్ని రాష్ట్రాలకు విస్తరించనున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణతోపాటు మరో 15 రాష్ట్రాల్లో ప్రస్తుతం బర్త్ రిజిస్ట్రేషన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేశారు. గత ఏడాది నుంచే ఈ విధానం అమల్లోకి వచ్చింది. తాజాగా దీన్ని అన్ని రాష్ట్రాలకు విస్తరించేందుకు భారత ప్రత్యేక గుర్తింపు సాధికార సంస్థ (ఉడాయ్) చర్యలను ముమ్మరం చేసింది.

ప్రస్తుతం ఐదేళ్ల లోపు చిన్నారులకు ఆధార్ కార్డు తీసుకున్నప్పటికీ వారి వేలిముద్రలు, ఐరిస్‌ను నమోదు చేయలేదు. వారి ఫోటోను తల్లిదండ్రుల ఆధార్‌తో అనుసంధానిస్తున్నారు. ఆ తర్వాత 5 నుంచి 15 ఏళ్ల లోపు మధ్యలో బయోమెట్రిక్‌ను అప్‌డేట్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దేశ వ్యాప్తంగా దాదాపు 1000 రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారులను ఆధార్ ఆధారం గానే నిర్ణయిస్తున్నారు. ఈ క్రమం లోనే ఆధార్‌ను మరింత పటిష్ఠం చేసేందుకు ఉడాయ్ సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమం లోనే తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు 134 కోట్ల ఆధార్ కార్డులను జారీ చేసినట్టు ఉడాయ్ వెల్లడించింది. గత ఏడాది ఆధార్‌ను అప్‌డేట్ చేసుకున్నవారు , కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు 20 కోట్ల మంది ఉన్నట్టు తెలిపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News