మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం
ఖండించిన కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్
న్యూఢిల్లీ: ఆధార్, ప్రత్యక్ష పన్నుల విధానం (డిబిటి)ను ఐఎంఎఫ్ ప్రశంసించిన మరుసటి రోజు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థికమంత్రి పి చిదంబరం స్పందించారు. ఆధార్, డిబిటిలను కాంగ్రెస్ సారథ్యంలోని యూపిఎ ప్రభుత్వమే ప్రవేశపెట్టిందన్నారు. యూపిఎ ప్రవేశపెట్టిన విధానాలను మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం విస్తృతపరిచిందన్నారు. ఇంటర్నేషనల్ మానీటరీ ఫండ్ ప్రశంసలు లభించిన రెండు పాలసీలు కాంగ్రెస్ రూపొందించినవే అని ట్వీట్ చేశారు. ఆధార్, డిబిటి తమ గొప్పదనమే అని బిజెపి ప్రచారం చేసుకుంటుంది. అయితే జనవరి ప్రారంభించగా, యూపిఎ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని చిదంబరం గుర్తుచేశారు. దీనిపై అధికార ఎన్డీయే సర్కారు నేతలు మాట్లాడుతూ చిదంబరానికి రెండు కుంభకోణాలతో కీలక సంబంధాలు ఉన్నాయన్నాని ఆరోపించారు. ఇందిరాగాంధీ హయాంలో పేదరికాన్ని నిర్మూలించాలంటూ గరీభీ లబ్ధి పొందిన కాంగ్రెస్ పేదవారికి చేసిందేమీ లేదన్నారు. ఈ సందర్భంగా నేత, ్ఫుంద్ర మంత్రి యాదవ్ గతంలో పార్లమెంట్‌లో చిదంబరం చేసిన వ్యాఖ్యల పాత వీడియోను సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. పార్లమెంటు సాక్షిగాప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటల్ లావాదేవీలను చిదంబరం తీవ్రంగా విమర్శించారని, అదేవ్యక్తి డిజిటల్ ఇండియాను ఐఎంఎఫ్ ప్రశంసించేసరికి గొప్పే అని చెప్పడం ఆశర్యం కలిగిస్తుందన్నారు. డిబిటి విజయవంతమవడానికిప్రధాన కారణం నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జన్‌ధన్ పథకం అన్నారు. ఈ పథకం వల్ల ఏప్రిల్ 2022నాటికి 45కోట్లకుపైగా బ్యాంక్ ఖాతాలు ప్రారంభమయ్యాయని ట్వీట్ చేశారు. మీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పేదలను పేదలుగానే ఉంచిందని మోడీ ప్రభుత్వ హయాంలో వారు సాధికారత పొందారని బిజెపి ఐటీ విభాగం అమిత్ మాలవియా బయట ఉన్న మాజీ కేంద్రమంత్రి నిజాయితీగా మాట్లాడాలన్నారు. 201314 కాలంలో 43జిల్లాల్లో డిబిటి విధానం ద్వారా వసూలైతే, మధ్యకాలంలో జిల్లాల్లో వసూలయ్యాయని అధికారిక గణాంకాలు వాస్తవాలను వెల్లడిస్తున్నాయన్నారు.