Monday, December 23, 2024

సెప్టెంబర్ 14లో ముగియనున్న ఉచిత అప్‌డేట్ గడువు

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వ సేవలు పొందేందుకు, గుర్తింపు నిర్ధారణకు అత్యంత ప్రామాణికమైన ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకునేందుకు యుఐడిఎఐ ప్రస్తుతం ఉచితంగా సౌలభ్యం కల్పిస్తోంది. ఈ ఉచిత సర్వీస్ సెప్టెంబర్ 14తో ముగుస్తుంది. ఇప్పటికే యుఐడిఎఐ పలు మార్లు ఈ గడువును పొడిగించింది. దీనితో మరొకసారి పెంచుతుందాలేదా అనేది తెలియవలసి ఉంది. కనుక ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోవాలని అభిలషించేవారు డెడ్‌లైన్‌లోగా త్వరపడడం మంచిది. కాగా, ఆధార్ ఉచిత అప్‌డేట్ గడువును యుఐడిఎఐ అనేక మార్లు పొడిగించింది. మరొక సారి పొడిగింపుపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. ప్రస్తుతం కొనసాగుతున్న గడువును జూన్ 14న మూడు నెలల పాటు సంస్థ పొడిగించింది. అంతకుముందు నిరుడు డిసెంబర్ 15 నుంచి మార్చి 14 వరకు సంస్జ పొడిగించింది.

కాగా, ఆధార్ కార్డ్ వినియోగదారులు గుర్తింపు ఆధారాలు, చిరునామా ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఆధార్‌ను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు. గడచిన పది సంవత్సరాల్లో ఆధార్‌లో చిరునామాను అప్‌డేట్ చేసుకోకుంటే ఎటువంటి చార్జీలూ లేకుండానే అప్‌డేట్ చేసుకోవచ్చు. ఇందు నిమిత్తం ఆధార్‌తో అనుసంధానమైన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఉండాలి. దానికి వచ్చే ఒటిపిని ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక ఆధార్‌లో పేరు, మొబైల్ నంబర్, ఫోటో వంటి ఇతర వివరాలను అప్‌డేట్ చేసుకోవాలంటే యుఐడిఎఐ అధికారిక కేంద్రాలను సందర్శించవలసి ఉంటుంది. కాగా, యుఐడిఎఐ మార్గదర్శకాల ప్రకారం, వినియోగదారులు ప్రతి పది సంవత్సరాలకు ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకోవాలి. తద్వారా, చిరునామా, ఇతర వివరాలు అప్‌డేల్ అవుతుంటాయని, ప్రభుత్వ పథకాలు పొందడంలో ఎటువంటి ఇబ్బందులూ ఎదురుకాబోవని యుఐడిఎఐ చెబుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News