Thursday, July 4, 2024

ఆధార్ ఉచిత అప్‌డేట్ గడువు 3 నెలలు పెంపు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఆధార్‌ను వినియోగదారులు ఉచితంగా అప్‌డేట్ చేసుకోవడానికి గడువును మరో మూడు నెలల వరకూ పొడిగిస్తున్నట్లు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఉడాయ్) ప్రకటించింది. గతంలో ఇచ్చిన గడువు శుక్రవారం నాటికి ముగియడంతో ఈ తుది తేదీని మరో ౩ నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఉడాయ్ తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించింది. పెరిగిన గడువు ప్రకారం దేశంలోని ప్రజలు తమ ఆధార్ కార్డులోని వివరాలను 14 సెప్టెంబరు 2024 వరకూ ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు.

ఆధార్ గుర్తింపు కార్డుల్లో చాలా ముఖ్యమైన డాక్యుమెంట్ కావడంతో బ్యాంకు ఖాతా ప్రారంభించడం దగ్గర నుండి వృద్ధాప్య పింఛను వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు లబ్ధిదారుడిగా గుర్తించేంత వరకూ ఉపయోగపడుతోంది. అలాగ్ బస్ టిక్కెట్ బుకింగ్ నుండి ఎయిర్ బస్ టిక్కెట్ వరకూ, పాఠశాలల్లో అడ్మిషన్ల నుండి పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగంలో చేరేంత వరకూ ఆధార్ కీలకంగా మారింది. జననం నుండి మరణం వరకూ ప్రతీ దశలోనూ, ప్రతి విషయానికీ ఆధార్ ఎంతో ఉపయోగకరంగా ఉంటోంది.

ఆధార్ అప్‌డేట్ కాకపోతే నష్టాలెన్నో..!
ఒక విధంగా చెప్పాలంటే ఆధార్ కార్డు అనేది ఒక వ్యక్తికి జాతక చక్రంగా మారింది. దీనిలో ఆ వ్యక్తి పేరు, జండర్, చిరునామా, వయస్సు, ఐరిష్, బయోమెట్రిక్ సమాచారం పూర్తిగా నిక్షిప్తమై ఉంది. ఆధార్‌కు ఉన్న ప్రాముఖ్యత కారణంగా, దానిని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడం ఎంతో ముఖ్యం. వ్యక్తిగత వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోకపోతే సదరు వ్యక్తి జాతకమే మారిపోయే ప్రమాదం ఉంది.

ప్రభుత్వం నుండి ప్రైవేటు సంస్థల వరకూ ఎటువంటి ప్రయోజనం పొందాలన్నా ఆధార్ అవసరం. అలాగే ఆధార్ అప్‌డేట్ కూడా అందే అవసరం. ఆధార్ కార్డు తీసుకొని 10 సంవత్సరాలు దాటి ఉంటే అలాంటి వ్యక్తులంతా వీలైనంత త్వరగా వివరాలను అప్‌డేట్ చేయాలని పౌరులందరికీ ఉడాయ్ సూచించింది. వివరాలను నవీకరించడానికి అసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ ఉచితంగా అప్‌డేట్ చేసే సదుపాయం ఆన్‌లైన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఒకవేళ ఆధార్ కేంద్రానికి వెళ్ళి వివరాలను నవీకరించుకోవాలంటే అందుకు కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News