Monday, December 23, 2024

ఆధార్ ఉచిత అప్‌డేట్.. త్వరపడండి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్ చేయాలనుకుంటే ఈ నెలలోనే చివరి అవకాశం ఉంది. యుఐడిఎఐ ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఈ గడువు సెప్టెంబర్ 14తో ముగుస్తుంది. దీని తర్వాత ఆధార్‌ను అప్‌డేట్ చేయడానికి చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఈ సదుపాయం జూన్ 14 వరకు ఉంది. ఆ తర్వాత మూడు నెలల పాటు పొడిగించారు. యుఐడిఎఐ ప్రత్యేకంగా 10 సంవత్సరాల క్రితం ఆధార్ కార్డ్ పొంది ఒక్కసారి కూడా అప్‌డేట్ చేసుకోని వారి కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆధార్‌ను అప్‌డేట్ చేయడానికి, యుఐడిఎఐ అధికారిక వెబ్‌సైట్ మై ఆధార్‌ని సందర్శించడం ద్వారా వినియోగదారులు తమ వివరాలను స్వయంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. అప్‌డేట్ చేయలేకపోతే గడువు తర్వాత ఆధార్ కేంద్రానికి వెళ్లి ఈ పనిని పూర్తి చేయాలి, దీనికి రూ. 50 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News