- Advertisement -
సుప్రీంకోర్టులో కేంద్రం స్పష్టీకరణ
న్యూఢిల్లీ: కొవిడ్ వ్యాక్సినేషన్ కోసం కొవిన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఆధార్ కార్డు తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు తెలియచేసింది. వ్యాక్సినేషన్ కోసం పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెను, పాన్ కార్డు, వోటర్ కార్డు, రేషన్ కార్డుతోసహా తొమ్మిది గుర్తింపు కార్డులలో ఏదైనా సమర్పించవచ్చని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలియచేసింది. కేంద్ర ప్రభుత్వ సమాధానాన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం కొవిన్ పోర్టల్‌లో ఆధార్ కార్డు నమోదును తప్పనిసరి చేస్తున్నారని ఫిర్యాదు చేస్తూ సిద్ధార్థశంకర్ శర్మ దాఖలు చేసిన పిల్‌ను కొట్టివేసింది.
- Advertisement -