Monday, December 23, 2024

ఉచిత కరెంట్‌కు ఆధార్ తప్పనిసరి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఉచిత కరెంటుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల ఉచిత కరెంట్ పొందాలనుకునే వారికి ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ఉచిత కరెంటు పొందాలనుకునే వారు ఆధార్ కలిగి ఉన్నట్లు రుజువు చూ పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఆ ధార్ లేని వారు వెంటనే ఆధార్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆ తర్వాతే పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వం జీ ఓ జారీ చేసింది.

తనిఖీ సమయంలో అధికారులకు దరఖాస్తు దారులు ఆధార్ కార్డు తప్పనిసరి చూపించాలని ఉత్తర్వుల్లో పే ర్కొంది. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల లో భాగంగా ఈ పథకాన్ని ప్రభుత్వం అ మలు చేయబోతోంది. ఇప్పటికే ఆరు గ్యారంటీలలో భాగమైన ఆర్‌టిసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ లిమిట్ రూ.10 లక్షలకు పెంచింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, మహిళలకు రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకాల అమలుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News