హైదరాబాద్: రేషన్ మోసాలను అరికట్టేందుకు కేంద్రం ఆధార్ కార్డుతో రేషన్ కార్డు లింక్ చేయాలనే నిబంధన తీసుకొచ్చింది. రేషన్ కార్డు ద్వారా సబ్సిడీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బియ్యం, గోదుమలు వంటి నిత్యావసర సరుకులు అందిస్తాయి. అర్హులకే లబ్ధి చేకూర్చడంతో పాటు, నఖిలీ రేషన్ కార్డులను గుర్తించవచ్చనేది కేంద్రం అభిప్రాయం. ఆధార్ కార్డ్, రేషన్ కార్డును లింక్ చేయడానికి తొలుత కేంద్ర ప్రభుత్వం మార్చి 31వ తేదీని చివరి తేదీగా నిర్ణయించింది.
అయితే తాజాగా ఈ డెడ్‌లైన్‌ను ప్రభుత్వం పొడిగించింది. ఆధార్, రేషన్ కార్డ్ లింక్ చివరి తేదీని జూన్ 30 వరకు పొడిగించింది. దీనికి సంబందించిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ తాజాగా ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆన్ లైన్ లో లింక్ చేయడానికి పిడిఎస్ పోర్టల్ లోకి వెళ్లి సంబందిత వివరాలు నమోదుచేసి ఆధార్‌ను, రేషన్ కార్డుతో లింక్ చేసుకోవచ్చు