Monday, December 23, 2024

పదేళ్లకోసారి ఆధార్ అప్‌డేట్ చేయాలట!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆధార్ నియమాలను ప్రభుత్వం సవరించింది. ఆధార్ కార్డుదారులు 10 ఏళ్లకు ఒక్కసారైనా అప్‌డేట్ చేయించుకోవాలని, దానికి సపోర్టింగ్ పత్రాలను సమర్పించాలని కొత్త రూల్ తెచ్చింది. ఈ మేరకు ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటి మంత్రిత్వ శాఖ గెజిట్ ప్రకటన విడుదలచేసింది. ఆధార్‌లో ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ(పిఓఐ), ప్రూఫ్ ఆఫ్ అడ్రస్(పిఓఏ) డాక్యుమెంట్లు సమర్పించాలని పేర్కొంది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యుఐడిఎఐ) గత నెల ఐడెంటిఫికేషన్, రెసిడెన్స్ ప్రూఫ్ డాక్యుమెంట్లు అప్‌డేట్ చేసుకోవాలని కోరింది. యుఐడిఏఐ ‘అప్‌డేట్ డాక్యుమెంట్’ అని ఓ కొత్త ఫీచర్‌ని కూడా డెవలప్‌చేసింది. మై ఆధార్ పోర్టల్ లేక మై ఆధార్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో లేక దగ్గరలోని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కేంద్రంలో కూడా అప్‌డేట్ చేసుకోవచ్చని పేర్కొంది.

ఇప్పటి వరకు 134 కోట్ల ఆధార్ నంబర్లను జారీచేశారు. ఇప్పుడు ఎంత మంది అప్‌డేట్ చేసుకోవాల్సి ఉందన్న వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. గత ఏడాది దాదాపు 16 కోట్ల మంది వివిధ విషయాలను అప్‌డేట్ చేసుకున్నారు. దాదాపు 650 రాష్ట్రప్రభుత్వ పథకాలకు, 315 కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఆధార్ అథంటికేషన్‌నే వాడుతున్నారట.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News