Wednesday, January 22, 2025

ఆన్‌లైన్‌లో ఆధార్ అప్‌డేట్ సెప్టెంబ‌ర్ 14 వ‌ర‌కు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆన్‌లైన్ ద్వారా ఆధార్ కార్డులో ఏదైనా అప్‌డేట్ చేసుకోవాలంటే, ఆ డెడ్‌లైన్‌ను ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 14వ తేదీ వ‌ర‌కు పొడిగించారు. నిజానికి జూన్ 14 వ‌ర‌కే ఆధార్ అప్‌డేట్ సౌకర్యం ఉండింది. బ‌యోమెట్రిక్‌, డెమోగ్రాఫిక్ డేటా స‌రిగ్గా ఉండాల‌న్న ఉద్దేశంతో ఆధార్‌ను అప్‌డేట్ చేసే తేదీని పొడిగించిన‌ట్లు యూఐడీఏఐ తెలిపింది.

ప్ర‌స్తుతం క‌ల్పించిన అప్‌డేట్ సౌక‌ర్యం ప్ర‌కారం.. ఆధార్ కార్డు మీద ఉన్న అడ్రెస్, పుట్టిన రోజు, వ‌య‌సు, లింగం, మొబైల్ నెంబ‌ర్‌, ఈమెయిల్ అడ్ర‌స్‌, రిలేష‌న్‌షిప్ స్టేట‌స్ లాంటి వివ‌రాల‌ను మార్చుకోవ‌చ్చు. అయితే ఆన్‌లైన్‌లో జ‌రిగే ఆధార్ అప్‌డేట్‌లో ఐరిస్ స్కాన్లు, ఫింగ‌ర్ ప్రింట్స్‌, ఫేషియ‌ల్ ఫోటోగ్రాఫ్‌ల‌ను మార్చ‌డం కుద‌ర‌దు. పుట్టిన తేదీ మార్చే విష‌యంలో ఒక కండీష‌న్ పెట్టారు. ఆధార్ రిజిస్ట‌ర్ చేసిన తేదీ నుంచి మూడేళ్ల వ‌ర‌కు మాత్ర‌మే పుట్టిన తేదీని మార్చే అవ‌కాశం క‌ల్పించారు. ఇక జెండ‌ర్ విష‌యంలో ఒకేసారి మాత్ర‌మే ఆధార్‌లో మార్పు చేసుకోవాలి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News