Monday, December 23, 2024

ఆధార్ ధృవీకరణలో ప్రైవేటుకూ అనుమతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో పౌరుల గుర్తింపు ప్రక్రియలో అత్యవసరం అయిన ఆధార్ అధీకృత ధృవీకరణను ఇక ప్రైవేటు సంస్థలు కూడా చేపట్టేందుకు వీలేర్పడుతోంది. ఇప్పటివరకూ ప్రభుత్వమంత్రిత్వ శాఖల పరిధిలోనే ఈ ఆధార్ అథెంటికేషన్ ప్రక్రియ జరుగుతోంది. ఇకపై దీనిని ప్రైవేటు సంస్థలు కూడా చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖ ప్రతిపాదించింది. సంబంధిత విధివిధానాలు రూపొందించింది. ప్రభుత్వరంగం నుంచి అందే వివిధ ప్రయోజనాలు లబ్థిదారులకు అందేందుకు , సబ్సిడీలకు, సేవలకు తప్పనిసరిగా పౌరుల ఆధార్‌కార్డుల ధృవీకరణ అవసరం. ఇప్పటివరకూ ఆధార్ సంబంధిత అధీకృత సంస్థ యుఐడిఎఐ ప్రతిరోజూ 7 నుంచి 8 కోట్ల వరకూ ఆధార్‌కార్డుల ధృవీకరణ చేపడుతోంది.

ఆధార్ ధృవీకరణల తరువాత పౌరులకు అందే ప్రయోజనాలలో అత్యధిక శాతం అంటే 20 శాతం వరకూ ఆహార ధాన్యాల సరఫరా (పిడిఎస్) ఖాతాలో ఉంది. తరువాత టెలికం రంగంలో 6 శాతం వరకూ సేవలు ఈ ప్రక్రియతో అందుతాయి. కేంద్ర సంబంధిత మంత్రిత్వశాఖ ఆధార్ చట్టానికి ప్రతిపాదించిన సవరణల మేరకు ఇకపై ప్రైవేటు సంస్థలు కూడా తగే లైసెన్సులు పొందడం ద్వారా అథంటికేషన్ ప్రక్రియను చేపట్టేందుకు వీలేర్పడుతుంది. మంత్రిత్వశాఖ తన ప్రతిపాదనపై పౌరులు తమ స్పందనను వచ్చే నెల 5 లోగా పంపించాలని ప్రకటించారు. మైగవ్ వెబ్‌సైట్‌కు వీటిని చేరవేయవచ్చునని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News