- Advertisement -
చెన్నై: వర్ధమాన నటుడు ఆది పినిశెట్టి అనేక సినిమాల్లో నటించి తన కెరీర్‌ను మెరుగుపరుచుకున్నాడు. అతడు ప్రముఖ దర్శకుడు రవి రాజా పినిశెట్టి కుమారుడు. సరైనోడు, నిన్ను కోరి, రంగస్థలం, నీవెవరో, యూటర్న్, గుడ్ లక్ సఖీ, మలుపు, మరకతమణి వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. కాగా ఆది ఇప్పుడు కన్నడ నటి నిక్కీ గల్రానీతో పీకలోతుల ప్రేమలో ఉన్నాడట. వారిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాల సభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వినికిడి. త్వరలోనే నిశ్చితార్థం జరిగి వారిద్దరూ ఒక్కటి కానున్నారని చిత్ర రంగంలో టాక్. వేచి చూద్దం ముగింపు ఏమిటో?
- Advertisement -