ఇండియాస్ బిగ్గెస్ట్ వీఎఫ్ఎక్స్ మూవీగా ఇప్పటి వరకు ‘బాహుబలి 2’ నిలిచింది. ‘బాహుబలి 2’ కోసం దర్శక ధీరుడు రాజమౌళి ఏకంగా 2500లకు పైగా వీఎఫ్ఎక్స్ షాట్స్‌ను షూట్ చేశాడు. ఇప్పటి వరకు ఇండియాలో మరే సినిమా కూడా ఆ రేంజ్లో వీఎఫ్ఎక్స్ షాట్స్‌తో రాలేదు. ఇక ‘బాహుబలి 2’ ను మించిన సినిమా ‘ఆదిపురుష్’ అంటూ మొదటి నుండి చెబుతూ వస్తున్నారు. బాహుబలి 2 సినిమా కంటే ఏకంగా మూడు రెట్లు అదనంగా ‘ఆదిపురుష్’లో వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయంటూ తెలిసింది. ఆదిపురుష్ సినిమా విజువల్ వండర్‌గా ఉండబోతుందట. సినిమాలో దాదాపుగా 90 శాతం వరకు వీఎఫ్ఎక్స్ సన్నివేశాలు ఉంటాయని అంటున్నారు. ఈ సినిమాలో ఏకంగా 8000 లకు కాస్త అటు ఇటుగా వీఎఫ్ఎక్స్ సన్నివేశాలు ఉంటాయట. అంటే ఇది ‘బాహుబలి 2’కు ఏకంగా మూడు రెట్లు అదనం.
ఈ సినిమాలో మోషన్ గ్రాఫిక్స్‌ను కూడా దర్శకుడు ఓమ్ రౌత్ చూపించబోతున్నాడు. ‘బాహుబలి 2’ ఇప్పటి వరకు ఇండియాస్ బిగ్గెస్ట్ వీఎఫ్ఎక్స్ మూవీనే కాకుండా వసూళ్ల విషయంలో కూడా దీన్ని మించిన సినిమా రాలేదు. ఇప్పుడు వీఎఫ్ఎక్స్ షాట్స్ విషయంలో ‘ఆదిపురుష్’ ఆ సినిమాను దాటేస్తోంది. ఇక వసూళ్ల విషయంలో ‘బాహుబలి 2’ను ‘ఆదిపురుష్’ బ్రేక్ చేస్తుందేమో చూడాలి. ఈ రెండు సినిమాల్లో కూడా హీరో ప్రభాస్ అనే విషయం తెలిసిందే. రికార్డు బ్రేక్ అయినా కాకున్నా తెలుగు వారికి ఇది గర్వ కారణమే.
Aadi Purush have 3 times more VFX Shots than Baahubali 2