Friday, December 27, 2024

థ్రిల్ ఫీల్ అవుతారు

- Advertisement -
- Advertisement -

Aadi sai act in Black movie

 

మహంకాళి మూవీస్ పతాకంపై ఆది సాయి కుమార్ హీరోగా బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ మండా ముఖ్యమైన పాత్రలో జిబి కృష్ణ దర్శకత్వంలో మహంకాళి దివాకర్ నిర్మిస్తున్న చిత్రం ‘బ్లాక్’. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను ఆది తండ్రి సాయి కుమార్ పాత్రికేయుల సమక్షంలో విడుదల చేశారు. ఈ చిత్రాన్ని ఈ నెల 28న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు జి బి కృష్ణ మాట్లాడుతూ “ఇది చాలా డిఫరెంట్ కథ. ఆది క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది”అని అన్నారు. హీరో ఆది సాయి కుమార్ మాట్లాడుతూ “సినిమా చూసే ప్రేక్షకులు చాలా థ్రిల్ ఫీల్ అవుతారు. అందరికీ ఈ సినిమా బాగా నచ్చుతుంది” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిగ్ బాస్ ఫేమ్ కౌషల్ మండా, నిర్మాత మహంకాళి దివాకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News