Monday, January 20, 2025

కెటిఆర్ అరెస్ట్ అయితే గొడవకు కుట్రలు: ఆది శ్రీనివాస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అరెస్ట్ అయితే తెలంగాణ వ్యాప్తంగా గొడవ చేయడానికి బిఆర్ఎస్ కుట్రలు చేస్తోందని కాంగ్రెస్ ఎంఎల్ఎ ఆది శ్రీనివాస్ తెలిపారు. నియోజకవర్గానికి కోటి రూపాయలు బిఆర్ఎస్ పార్టీ కేటాయించినట్లు ఆరోపణలు చేశారు. తేలుకుంట్ల శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ కుట్ర చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందని ఆది శ్రీనివాస్ అనుమానం వ్యక్తం చేశారు.

ఈ కార్ ఫార్మూలా రేస్ వ్యవహారంలో ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరిగిందన్న అభియోగం పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే, బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌పై అవినీతి నిరోధకశాఖ గురువారం కేసు నమోదు చేసింది. నాలుగు సెక్షన్ల కింద నమోదు చేసిన ఈ కేసులో ఎ1గా కెటిఆర్, ఎ2గా అ ప్పటి మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐఎఎస్ అధికారి అరవింద్ కుమార్, ఎ-3గా హెచ్‌ఎండిఎ రిటైర్డు చీఫ్ ఇంజినీర్ బిఎల్‌ఎన్ రెడ్డిని పేర్కొన్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News