Wednesday, January 15, 2025

లొట్టపీసు కేసు అంటావా…. ఇప్పుడు మాట్లాడు

- Advertisement -
- Advertisement -

కేటిఆర్‌పై ఆది శ్రీనివాస్, దయాకర్ ధ్వజం

మన తెలంగాణ / హైదరాబాద్ : ఫార్ములా ఈ కార్ రేసు అంశంలో మాజీ మంత్రి కెటిఆర్‌కు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైందని, దీంతో అటు గోడ దెబ్బ ఇటు చెంపదెబ్బలా ఆయన పరిస్థితి మారిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. తనపై లొట్ట పీసు కేసు పెట్టారంటూ అనరాని మాటలతో రెచ్చిపోయిన కెటిఆర్ దమ్ముంటే ఇప్పుడు మాట్లాడాలని ఆయన సవాలు విసిరారు. ఫ్రస్ట్రేషన్ లో కెటిఆర్ ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదన్నారు. ఈ కార్ రేసు అంశంలో నిబంధనలకు విరుద్ధంగా కెటిఆర్ ప్రజాధనాన్ని దుర్మినియోగం చేశారని దుయ్యబట్టారు.

అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపాలని చూస్తున్నారని కెటిఆర్ అనడాన్ని ఆయన తప్పుపట్టారు. అదే చేయాలంటే ఈ ప్రభుత్వం వచ్చి 13 నెలలు అయినా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ హయంలో రేవంత్ రెడ్డిని అర్థరాత్రి తలుపులు బద్ధలు కొట్టి అరెస్ట్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

గవర్నర్ అనుమతితో ఎసిబి, ఆ తర్వాత ఈడి ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తే లొట్టపీసు కేసు అంటూ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. అధికారంలో ఉండగా మాట్లాడిన నలుగురే ఇప్పుడూ మాట్లాడుతున్నారని విమర్శించారు. మేడిగడ్డ, ఫోన్ ట్యాపింగ్, గొర్రెల, చేపల కుంభకోణాలపై దర్యాప్తు జరుగుతోందన్నారు. కోర్టులకు వెళ్లి విచారణ ఆపాలని చూసినా నిజం నిప్పు లాంటిదన్నారు. మీరు చేసిన పొరపాటులతో దేవుడు కూడా మీ పక్షాన లేడన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం అంశంలో ఎక్కడా రాజీపడకుండా చట్టప్రకారం శిక్ష తప్పదని హెచ్చరించారు.

అది ఎంత పెద్దవారైనా వదిలే ప్రసక్తే లేదన్నారు. కెటిఆర్ చేస్తున్న దానికి కెసిఆర్ క్షమాపణ చెప్పాలని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి వీధి రౌడీలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధి రౌడీలతో కెటిఆర్ రాజకీయం చేస్తున్నాడన్నారుఉ. అధికారులు, ఎంఎల్‌ఎలు, అందరిపైనా దాడులు చేసేది బిఆర్‌ఎస్ నేతలేనని ఆరోపించారు. దాడుల సంస్కృతిని బిఆర్‌ఎస్ ప్రోత్సహిస్తోందన్నారు. కెటిఆర్ సహా అవినీతి చేసిన వాళ్లంతా ఉండాల్సింది జైల్లో అని అన్నారు. కోదండ రామ్, మందకృష్ణ మాదిగ, విమలక్క సహా ప్రజాస్వామ్యక వాదులు, ప్రతిపక్ష నేతలు మీద బిఆర్‌ఎస్ ఏం చేసిందో అందరికీ తెలుసని అన్నారు. ప్రజలే దాడులు చేసే సంస్కృతిని బిఆర్‌ఎస్ నేతలు తెచ్చుకోవద్దని అద్దంకి దయాకర్ హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News