Wednesday, January 22, 2025

‘ఈగల్‌’ నుంచి ‘ఆడు మచ్చా’ సాంగ్ ప్రోమో విడుదల..

- Advertisement -
- Advertisement -

‘టైగర్ నాగేశ్వరరావు’ నిరాశపర్చడంతో మాస్ మహా రాజా రవితేజ ప్రస్తుతం తాను నటిస్తున్న ‘ఈగల్‌’ మూవీపైనే ఆశలు పెట్టుకున్నారు. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా భారీగా తెరకెక్కిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ మూవీనలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, టీజర్ మూవీపై భారీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ సింగిల్ ‘ఆడుమచ్చా..’ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్.

రాహుల్ సిప్లిగంజ్‌ పాడిన ఈ పాటలో రవితేజలో లాంగ్ హెయిర్‌, గడ్డంతో ఊరమాస్ అవతారంలో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాడు. డిసెంబరు 05 సాయంత్రం 6.03 నిమిషాలకు ఫుల్ లిరికల్‌ వీడియో సాంగ్‌ను విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో నవదీప్‌, కావ్య థాపర్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్న ఈ చిత్రం 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News