Wednesday, January 22, 2025

రొమాన్స్‌లో మునిగితేలుతూ…

- Advertisement -
- Advertisement -

Aafat Lyrical Song Video Released from 'LIGER'

పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ, పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘లైగర్’ (సాలా క్రాస్‌బ్రీడ్) ఈనెల 25న విడుదలకానుంది. ది గ్రేట్ మైక్‌టైసన్ ఈ సినిమాతో ఇండియన్ సినిమాలో అరంగేట్రం చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్, రెండు సింగిల్స్- అక్డీ పక్డీ , వాట్ లగా దేంగే సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ఈ చిత్రంలోని మూడవ పాట ఆఫత్ తాజాగా విడుదలైంది. అందమైన బీచ్ హౌస్ నేపధ్యంలో చిత్రీకరించిన ఈ పాట ప్రేక్షకులని మైమరిపిస్తోంది. రమ్యకృష్ణ తన కొడుకు విజయ్ దేవరకొండకు అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండమని చెప్పడం, విజయ్, అనన్య ఇంటి నుండి బయటకు వచ్చి బీచ్‌కి వెళ్ళడం లవ్లీగా వుంది. విజయ్, అనన్యల కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది.

విజయ్ సూపర్ హ్యాండ్సమ్‌గా కనిపిస్తుంటే అనన్య నాజూకు అందాలు ఆకట్టుకున్నాయి. డాన్స్‌లు కూడా అందంగా వున్నాయి. తెలుగు పాటని సింహా, శ్రావణ భార్గవి అలపించిన తీరు అద్భుతంగా వుంది. భాస్కరభట్ల రవికుమార్ ఈ పాటకు అందించిన యూత్‌ఫుల్ లిరిక్స్ ఆకట్టుకున్నాయి. ఈ పాటకు తనిష్క్ బాగ్చి అద్భుతమైన సంగీతాన్ని అందించగా, పియూష్- షాజియా కొరియోగ్రఫీ బ్రిలియంట్‌గా వుంది. అజీమ్ దయాని మ్యూజిక్ సూపర్‌వైజర్. పూరి కనెక్ట్, బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకానుంది.

Aafat Lyrical Song Video Released from ‘LIGER’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News