Monday, January 20, 2025

శ్రద్ధా హత్య కేసు.. బెయిల్ వద్దన్న ఆఫ్తాబ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సంచలనం సృష్టించిన కాల్‌సెంటర్ ఉద్యోగి శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలా తన బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నాడు. సమాచార లోపం కారణం గానే ఆ పిటిషన్‌ను దరఖాస్తు చేసినట్టు ఆఫ్తాబ్ కోర్టుకు తెలిపాడు. దీంతో అతడి అభ్యర్థనను న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసులో బెయిల్ కోరుతూ ఆఫ్తాబ్ తరఫున న్యాయవాది డిసెంబర్ 15న కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే అది బెయిల్ పిటిషన్ అని తనకు తెలియదని , పొరపాటుగా దాఖలైందని ఆ తర్వాత నిందితుడు కోర్టుకు తెలిపాడు.

దీనిపై ఢిల్లీ లోని సాకేత్ గురువారం విచారణ చేపట్టింది. సమాచార లోపం కారణం గానే ఈ పిటిషన్‌ను దరఖాస్తు చేసినట్టు ఆఫ్తాబ్ న్యాయవాది చెప్పారు. ఈ దరఖాస్తును ఉపసంహరించుకోవాలని నిందితుడు నిర్ణయించుకున్నట్టు కోర్టుకు తెలిపారు. దీంతో ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు అడిషనల్ సెషన్స్ జడ్జి బృందా కుమారి తెలిపారు. కాగా, అంతకు ముందు ఈ పిటిషన్‌కు ఢిల్లీ పోలీసులు సమాధానమిచ్చారు. ఇది అత్యంత తీవ్రమైన నేరమని, సమాజంపై పెను ప్రభావం చూపించిందని పోలీసులు పేర్కొన్నారు. అందువల్ల అతడికి బెయిల్ మంజూరు చేయొద్దని కోర్టును కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News