ముంబై: ప్రతిష్టాత్మకమైన ట్వంటీ20 ప్రపంచకప్‌లో ప్రతిభావంతులైన క్రికెటర్లకే తుది జట్టులో స్థానం కల్పించాలని మాజీ క్రికెటర్లు పార్థివ్ పటేల్, ఆకాశ్ చోప్రాలు సూచిస్తున్నారు. వరల్డ్‌కప్ సన్నాహకాల్లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్య ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయకపోవడాన్ని వారు తప్పుపట్టారు. టీమిండియాలో శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ వంటి ప్రతిభావంతులైన ఆల్‌రౌండర్లు ఉన్నారని, వారికి తుది జట్టులో చోటు కల్పించాలని కోరారు. ఇక వార్మప్ మ్యాచ్‌లో సీనియర్ బౌలర్ భువనేశ్వర్ భారీగా పరుగులు సమర్పించుకోవడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న మ్యాచుల్లో హార్దిక్, భువనేశ్వర్‌లను తప్పించి ప్రతిభావంతులైన క్రికెటర్లకు చోటు కల్పించాలన్నారు. అంతేగాక రాహుల్ చాహర్‌ను వరల్డ్‌కప్ జట్టులో తీసుకోవడం కూడా సరైన నిర్ణయం కాదన్నారు. అతని బదులు వెంకటేశ్ అయ్యర్‌లాంటి ఆల్‌రౌండర్‌ను తీసుకోవడం మంచిదన్నారు.
Aakash Chopra Concerned over Bhuvneshwar Bowling